మరింత క్వాలిటీతో ట్విట్టర్‌ వీడియోలు

ABN , First Publish Date - 2021-10-02T05:33:13+05:30 IST

ట్విట్టర్‌ చేసిన తాజా అప్‌డేట్స్‌తో ఇకపై వీడియోలు మెరుగ్గా కనిపించనున్నాయి. అప్‌లోడ్‌, వీక్షణ రెంటికీ ఇది వర్తిస్తుంది. వీడియోను అప్‌లోడ్‌ చేసే సమయంలో ఉండే ....

మరింత క్వాలిటీతో ట్విట్టర్‌ వీడియోలు

ట్విట్టర్‌ చేసిన తాజా అప్‌డేట్స్‌తో ఇకపై వీడియోలు మెరుగ్గా కనిపించనున్నాయి. అప్‌లోడ్‌, వీక్షణ రెంటికీ ఇది వర్తిస్తుంది. వీడియోను అప్‌లోడ్‌ చేసే సమయంలో ఉండే ప్రీప్రాసెసింగ్‌ స్టెప్‌ను ట్విట్టర్‌ తొలగించిందని ‘ద వెర్జ్‌’ తెలిపింది. ఈ ప్రాసెస్‌ కారణంగా వీడియో చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేది. దీనితో క్వాలిటీ దెబ్బతినేది. అలాగే వీడియో ప్లేబాక్డ్‌ స్పీడ్‌ ఆప్షన్స్‌పై ట్విట్టర్‌ పనిచేస్తోందని రీసెర్చర్‌ ఒకరు వెల్లడించారు. ఆ మేరకు ఆ రీసెర్చర్‌ ఒక ఇమేజ్‌ను కూడా షేర్‌ చేయడం విశేషం. ట్విట్టర్‌ ఈమధ్య ‘స్పేసెస్‌’ పేరిట ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తులు, మూడు టాపిక్స్‌కు టాగ్‌ కావచ్చు. ఫైనాన్స్‌, మ్యూజిక్‌, టెక్నాలజీ సహా పది టాపిక్‌లకు ఈ వెసులుబాటు ఉంది. డిజెపియరింగ్‌ ట్వీట్స్‌పై పనిచేస్తున్నట్టు గత వారమే ట్విట్టర్‌ తెలిపింది. 

Updated Date - 2021-10-02T05:33:13+05:30 IST