ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోన్న ‘బ్యాన్ నీట్‘ హ్యాష్ ట్యాగ్

ABN , First Publish Date - 2021-09-12T23:41:35+05:30 IST

‘బ్యాన్ నీట్’ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు నెటిజన్స్. తమిళనాడులో 19 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షలో ఫెయిలవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకోవటంతో ఆందోళన మొదలైంది.

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోన్న ‘బ్యాన్ నీట్‘ హ్యాష్ ట్యాగ్

‘బ్యాన్ నీట్’ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు నెటిజన్స్. తమిళనాడులో 19 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షలో ఫెయిలవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకోవటంతో ఆందోళన మొదలైంది. అయితే, సెప్టెంబర్ 12, ఆదివారం నాడు ముందుగా చెప్పినట్లుగానే అధికారులు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షని విజయవంతంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలోనూ రికార్డు సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 16 లక్షల మంది ఈ సారి నీట్ రాశారు.

2021 సంవత్సరానికిగానూ నీట్ పరీక్ష తేదీని ప్రకటించినప్పట్నుంచీ పలు వివాదాలు చెలరేగుతున్నాయి. కొంత మంది ఎగ్జామ్ పేపర్ లీకైందంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు, అధికారులు మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. భద్రత విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చి చెబుతున్నారు. 

కొన్ని రాష్ట్రల్లో ప్రతీ ఏటా నీట్ నిర్వహణనే వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ మాదిరిగా మెడిసన్ కోర్సులకి కూడా రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే వివాదాస్పదంగా మారిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తాజాగా విద్యార్థి ఆత్మహత్యతో మరింత కాంట్రవర్సిగా తయారైంది. ఈ సారి పరీక్ష పూర్తైన వెంటనే ట్విట్టర్‌లో ‘బ్యాన్ నీట్‘ అంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేశారు చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్.   

  

Updated Date - 2021-09-12T23:41:35+05:30 IST