ట్విట్టర్ స్టాక్స్... డౌన్...

ABN , First Publish Date - 2021-06-18T22:13:38+05:30 IST

కేంద్రంతో తలెత్తిన విభేదాల నేపధ్యంలో... సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ స్టాక్స్ గురువారం భారీగా పతనమయ్యాయి.

ట్విట్టర్ స్టాక్స్... డౌన్...

న్యూఢిల్లీ : కేంద్రంతో తలెత్తిన విభేదాల నేపధ్యంలో... సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ స్టాక్స్ గురువారం భారీగా పతనమయ్యాయి. ట్విట్టర్‌కు కేంద్రం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం స్టాక్స్ పై ప్రతిఫలించింది. ట్విట్టర్ స్టాక్ బుధవారం 0.50 శాతం క్షీణించి 59.93 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


మార్కెట్ క్యాపిటలైజేషన్ 0.43 బిలియన్ డాలర్లు తగ్గి 47.64 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు సెషన్‌లో మార్కెట్ క్యాప్ 48.07 బిలియన్లుగా ఉంది. ఈ రోజు... ట్విట్టర్ స్టాక్ 59.93 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి 26 న 52 వారాల గరిష్టం 80.75 డాలర్లకు చేరుకున్న ట్విట్టర్ స్టాక్... ఇప్పుడు 60 డాలర్ల స్థాయికి వచ్చింది.


ఈ రోజు మాత్రం ట్విట్టర్ స్టాక్స్ కాస్త పుంజుకొని, 0.76 శాతం ఎగసి 60.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి 26 నుండి ట్విట్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటివరకు 22.54 శాతం(13.87 బిలియన్ డాలర్లు) పడిపోయింది. గతేడాది నవంబరు 13 న ట్విట్టర్‌కు ప్రభుత్వం నోటీసులు పంపించడంతో అప్పుడు ఈ స్టాక్స్ 43.48 డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-18T22:13:38+05:30 IST