May 2 2021 @ 19:21PM

తమన్‌కి ట్విట్టర్‌ పాజిటివ్‌!

ప్రపంచం అంతా కరోనా పాజిటివ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే సంగీత దర్శకుడు తమన్‌ మాత్రం ట్విట్టర్‌లో వస్తున్న  పాజిటివ్‌ రెస్పాన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆయన సంగీతం అందించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఫుల్‌ బిజీ అయిపోయారు. ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతానికి తమన్‌కు ప్రశంసల వెల్లువెత్తున్నాయి. అయితే ‘వకీల్‌సాబ్‌’ థియేటర్‌లో విడుదలైనప్పుడు స్పందన ఒక తీరులో ఉంటే... అమెజాన్‌ ఫ్రైమ్‌లో విడుదలైన రోజు నుంచి స్పందన రెట్టింపు అయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలో ‘ఈ బిట్‌లో ఆర్‌ఆర్‌ అద్భుతం, ఆ సీన్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది’ అని స్ర్కీన్‌షాట్‌లతో తమన్‌ ట్విట్టర్‌ పేజీ మొత్తం నింపేస్తున్నారు. తమన్‌ ఎంతో ఓపిగ్గా అందరికీ సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. దీంతో అందరూ తమన్‌కి ట్విట్టర్‌ అభిమానులు ఫుల్‌ పాజిటివ్‌గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. 


చీకటి కోణాన్ని బయటపెట్టారు: ఐశ్వర్యా రాజేశ్‌

అలాగే కథానాయిక ఐశ్వర్యారాజేశ్‌ ‘వకీల్‌సాబ్‌’ చిత్రాన్ని ఫ్రైమ్‌లో చూసి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ‘‘సొసైటీలో చీకటి కోణాన్ని, సమాజంలో స్ర్తీలను ఎలా చూస్తున్నారు అన్న విషయాలను ఎలా సినిమాలో బాగా చెప్పారు. ఈ ఎమోషనల్‌ డ్రామాలో పవన్‌కల్యాణగారిది వెన్నెముకలాంటి పాత్ర. నివేదా థామస్‌, అంజలి, అనన్యా నాగళ్ల బలమైన మహిళలుగా కనిపించారు’’ అని పేర్కొన్నారు.