Twitter కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-05-15T17:20:36+05:30 IST

కాలిఫోర్నియా : ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించిన

Twitter కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం

కాలిఫోర్నియా : ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో ట్విటర్ లీగల్ టీం స్పందించింది. ఎలాన్ మస్క్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలోని గోప్యత అంశాలను బయటపెట్టిన ఎలాన్ మస్క్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని లీగల్ బృందం వ్యాఖ్యానించింది. ట్విటర్ ఆటోమేటెడ్ యూజర్స్ పరిమాణం 100 అని బయటకు చెప్పడం సబబుకాదని, ఒప్పంద ఉల్లంఘేనని అసంతృప్తిని తెలియజేసింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్కే ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించారు. 


కాగా ట్విటర్‌లో అకౌంట్లను తనిఖీ చేసే బోట్ చెక్ నమూనా పరిమాణం 100 అని ఎలాన్ మస్క్ ఇటివల పేర్కొన్నారు. అంటే ట్విటర్‌లో స్పామ్ లేదా నకిలీ అకౌంట్లు లేదా ట్వీట్ల విశ్లేషించే ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ కేవలం 100 నమూనాలను మాత్రమే విశ్లేషించగలదనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బహిర్గతపరచడాన్ని ట్విటర్ లీగల్ తప్పుబట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని విమర్శించింది. అయితే ఇందుకు ఎలాన్ మస్క్ ఏం సమాధానమిచ్చారనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.


కాగా గత శుక్రవారం ఎలాన్ మస్క్ కీలకమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ట్విటర్ యాజమాన్యం ఇంకా అందజేయని కారణంగా నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఒప్పందానికి కట్టుబడే ఉన్నానని ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చారు.

Updated Date - 2022-05-15T17:20:36+05:30 IST