Twitter: ట్విట్టర్‌లో త్వరలో ఎవరూ ఊహించని ఫీచర్.. అది గానీ అందుబాటులోకి వస్తే..

ABN , First Publish Date - 2022-06-24T03:03:45+05:30 IST

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘Notes’ ఫీచర్‌పై ట్విట్టర్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో..

Twitter: ట్విట్టర్‌లో త్వరలో ఎవరూ ఊహించని ఫీచర్.. అది గానీ అందుబాటులోకి వస్తే..

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘Notes’ ఫీచర్‌పై ట్విట్టర్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ట్విట్టర్‌లో 2,500 పదాలతో పోస్ట్‌లు పెట్టే అవకాశం ఉంటుంది. కెనడా, ఘనా, యూకే, యూఎస్‌లోని కొంతమంది రైటర్స్‌కు మాత్రమే ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా ఉండనుందంటే.. హెడ్‌లైన్ ఇచ్చి.. ఆ హెడ్‌లైన్ కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే ఆ అంశం కనిపించే విధంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఒకసారి ట్విట్టర్‌లో నోట్‌ను పబ్లిష్ చేశాక ఏదైనా సవరించాలనుకున్నా, తప్పులు దొర్లినా ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ట్విట్టర్ తీసుకురానుంది.



అయితే.. ట్విట్టర్‌లో ట్వీట్స్ చూడటానికి మాత్రమే నెటిజన్లు ఆసక్తి చూపుతారని, అంత పెద్ద టెక్ట్స్‌ను చదివేందుకు ఆసక్తి చూపకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ట్విట్టర్‌లో 140 పదాలను పోస్ట్ చేసేందుకు మాత్రమే వీలుండేది. ఆ తర్వాత ఆ సంఖ్యను 280 పదాలకు పెంచారు. ప్రస్తుతం ట్విట్టర్‌ 280 పదాలను మాత్రమే అనుమతిస్తుంది. కానీ.. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మాత్రం 2500 పదాల వరకూ టైప్ చేసే అవకాశం ఉంటుంది. మరికొద్ది నెలల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2022-06-24T03:03:45+05:30 IST