ట్రంప్ ట్వీట్‌పై వివాదం.. హైడ్ చేసిన ట్విట్టర్

ABN , First Publish Date - 2020-05-29T22:20:42+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చాలాసార్లు వివాదాస్పద ట్వీట్టు చేసి వార్తల్లో నిలిచారు.

ట్రంప్ ట్వీట్‌పై వివాదం.. హైడ్ చేసిన ట్విట్టర్

మినియాపోలిస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చాలాసార్లు వివాదాస్పద ట్వీట్టు చేసి వార్తల్లో నిలిచారు. ఇదే క్రమంలో తాజాగా మిన్నెసోటాలో జరుగుతున్న ఆందోళనలపై కూడా వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో ట్విట్టర్ స్పందించింది. ట్రంప్ ట్వీట్‌ను హైడ్ చేసింది. నిరసనకారులను గూండాలతో పోల్చిన ట్రంప్.. ‘ఎంత కష్టమైనా మేం పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి. దోపిడీ మొదలవగానే కాల్పులు కూడా మొదలవుతాయి(వెన్ లూటింగ్ స్టార్ట్స్, ది షూటింగ్ స్టార్ట్స్)’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నిరసనకారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తమను గూండాలతో పోల్చడంపై ఆగ్రహించిన వారు.. ట్రంప్ ట్వీట్ హింసను ప్రేరేపిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్వీట్‌ను హైడ్ చేస్తూ ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-05-29T22:20:42+05:30 IST