Russian embassyకి ఫేస్‌బుక్, ట్విట్టర్ షాక్

ABN , First Publish Date - 2022-03-11T13:52:05+05:30 IST

రష్యా రాయబార కార్యాలయానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు షాక్ ఇచ్చాయి....

Russian embassyకి ఫేస్‌బుక్, ట్విట్టర్ షాక్

మాస్కో: రష్యా రాయబార కార్యాలయానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు షాక్ ఇచ్చాయి.ఉక్రెయిన్ దేశంలోని మారియుపోల్ హాస్పిటల్ పై జరిపిన బాంబు దాడిపై రష్యన్ ఎంబసీ పెట్టిన ట్వీట్‌, ఫేస్‌బుక్ పోస్టులను ట్విట్టర్,ఫేస్‌బుక్ తొలగించాయి.మారియుపోల్‌లోని పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి గురించి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం పోస్టు పెట్టింది. హింసాత్మక సంఘటనలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, నిబంధనలను ఉల్లంఘించినందుకు  ట్విట్టర్ ఇంక్, మెటా ప్లాట్‌ఫాం యొక్క ఫేస్‌బుక్ పోస్ట్‌లను తీసివేసినట్లు కంపెనీలు తెలిపాయి.


ఉక్రెయిన్ నగరంలోని ప్రసూతి, పిల్లల ఆసుపత్రిపై బుధవారం జరిగిన వైమానిక దాడిలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గురువారం తెలిపారు.‘‘మీరు ప్రస్తావించిన ట్వీట్‌లు ట్విట్టర్ నియమాలను ఉల్లంఘిస్తున్నందున మేం వాటిపై చర్య తీసుకున్నాం’’ అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.ఉక్రెయిన్ దాడి సమయంలో మాస్కో టెక్ ప్లాట్‌ఫారమ్‌లపై విరుచుకుపడింది.


Updated Date - 2022-03-11T13:52:05+05:30 IST