Trump ban సరికాదన్న Musk.. వైఫల్యమని ఒప్పుకున్న Jack

ABN , First Publish Date - 2022-05-11T18:35:52+05:30 IST

ట్విట్టర్ నుంచి @realDonaldTrump ను నిషేధించినందుకు నేనేమీ గొప్పగా మురిసిపోవడం లేదు, పండగ చేసుకోవడమూ లేదు. స్పష్టమైన హెచ్చరిక చేసిన అనంతరమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ట్విట్టర్ నుంచే కాకుండా బయటి నుంచి తీసుకున్న ఉత్తమ..

Trump ban సరికాదన్న Musk.. వైఫల్యమని ఒప్పుకున్న Jack

వాషింగ్టన్: America అధ్యక్ష ఎన్నికల అనంతరం రాజధాని Washington లోని క్యాపిటల్‌పై దాడి జరగడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump కారణమంటూ ఆయన Twitter account ను యాజమాన్యం శాశ్వతంగా తొలగించింది. అయితే అలా చేసి ఉండాల్సింది కాదని, Twitter కి కాబోయే CEO Elon Musk చెప్పగా.. ‘‘నిజమే అలా చేసి ఉండాల్సింది కాదు, ఇది వైఫల్యం’’ అని Twitter మాజీ CEO Jack Dorsey అంగీకరించారు. Trump ట్విట్టర్ ఖాతా తిరిగి వస్తుందా లేదా తెలియదు కానీ.. భవిష్యత్‌లో ఇలా శాశ్వత నిషేధాలు ఉండబోవనే విషయం జాక్ తాజా స్టేట్‌మెంట్‌తో వెల్లడి అవుతోంది.


ట్విట్టర్ వేదికగా జాక్‌ను Dan Primack అనే వ్యక్తి ప్రశ్నించారు. ‘‘వ్యక్తిగత Twitter users ని శాశ్వతంగా నిషేధించకూడదని తాను చేసిన ప్రతిపాదనకు జాక్ ఒప్పుకున్నారని మస్క్ అన్నారు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆ సమయంలో డోర్సే CEO గా ఉన్నారు’’ అని ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. దీనికి జాక్ సమాధానం ఇస్తూ ‘‘ఒప్పుకుంటాను. కానీ అక్కడ CSE, illegal behaviour, spam, network manipulation వంటి మినహాయింపులు ఉన్నాయి. కానీ శాశ్వత నిషేధం మా వైఫల్యం. ఇలాంటివి పని చేయవు’’ అని reply ఇచ్చారు.


ఇదే సమయంలో ట్రంప్ ట్విట్టర్ ఖాతా తొలగించిన అనంతరం తాను చేసిన ట్వీట్‌ను డోర్సే ప్రస్తావించారు. ఆ ట్వీట్‌లో ‘‘ట్విట్టర్ నుంచి @realDonaldTrump ను నిషేధించినందుకు నేనేమీ గొప్పగా మురిసిపోవడం లేదు, పండగ చేసుకోవడమూ లేదు. స్పష్టమైన హెచ్చరిక చేసిన అనంతరమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ట్విట్టర్ నుంచే కాకుండా బయటి నుంచి తీసుకున్న ఉత్తమ సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చివరిలో ‘ఇది సరైందేనా?’ అని నెటిజెన్లను ప్రశ్నించారు.

Read more