Twitter Ban: 57 వేల ఖాతాలను నిషేధించిన ట్విట్టర్.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-10-02T23:08:04+05:30 IST

చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography)పై ఉక్కుపాదం మోపుతున్న ట్విట్టర్(Twitter) భారత్‌లోని 57 వేలకు పైగా ఖాతాల

Twitter Ban: 57 వేల ఖాతాలను నిషేధించిన ట్విట్టర్.. కారణం ఏంటో తెలిస్తే..

న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography)పై ఉక్కుపాదం మోపుతున్న ట్విట్టర్(Twitter) భారత్‌లోని 57 వేలకు పైగా ఖాతాలను నిషేధించింది. జులై 26-ఆగస్టు 25 మధ్య మొత్తంగా 57,643 ఖాతాలను నిషేధించినట్టు తెలిపింది. చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography)ని ప్రచారం చేస్తున్నందుకు గాను వీటిపై వేటు వేసినట్టు తెలిపింది. ఈవారం మొదట్లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ మాట్లాడుతూ.. చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography) ఫిర్యాదులపై ట్విట్టర్(Twitter) నుంచి అందిన సమాధానం అసంపూర్తిగా ఉందని, దీనితో తాము సంతృప్తికరంగా లేమని పేర్కొన్నారు. ట్విట్టర్‌(Twitter)లో చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography), చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచార వీడియోలు షేర్ అవుతుండడంపై ట్విట్టర్(Twitter) ఇండియా పాలసీ హెడ్, ఢిల్లీ పోలీసులకు గత నెల 20న మలీవల్ సమన్లు జారీ చేశారు.  


చైల్డ్ పోర్నోగ్రఫీ(child pornography) వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తే ట్వీట్లను సుమోటోగా తీసుకున్న కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. చిన్నారులను పూర్తి నగ్నంగా చూపించడం, వారిపైనా, మహిళలపైనా జరుగుతున్న అత్యాచార వీడియోలను ట్విట్టర్‌లో షేర్ అవుతుండడాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా,  దేశంలోని ట్విట్టర్(Twitter) వినియోగదారుల నుంచి 1,088 ఫిర్యాదులను స్వీకరించినట్టు ట్విట్టర్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ట్విట్టర్(Twitter) ఖాతాలను నిషేధించమంటూ వచ్చిన 76 ఫిర్యాదులను పరిష్కరించినట్టు ట్విట్టర్(Twitter) పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని తాము సహించబోమని స్పష్టం చేసింది.   

Updated Date - 2022-10-02T23:08:04+05:30 IST