మురిసిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2021-01-27T06:31:29+05:30 IST

గ్రామీణ జిల్లాలోని వాడవాడలా మంగళవారం జాతీయ పతాకం రెపరెపలాడింది.

మురిసిన మువ్వన్నెల జెండా
రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్డీవో సీతారామారావు

ఘనంగా గణతంత్ర వేడుకలు

జాతీయ పతాకం ఎగరవేసిన అధికారులు

అలరించిన సంస్కాృతి కార్యక్రమాలు

ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు పురస్కారాలు


అనకాపలి, జనవరి 26: గ్రామీణ జిల్లాలోని వాడవాడలా మంగళవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. అధికారులు, పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఆర్డీవో జె.సీతారామారావు, జోనల్‌ కార్యాలయంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో రవీంద్రనాథ్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవమని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, ఆర్డీవో సీతారామారావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, ఏపీఈపీడీసీఎల్‌ ఈఈ సత్యనారాయణ విశాఖలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 


Updated Date - 2021-01-27T06:31:29+05:30 IST