- కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్ సిటీ/వనస్థలిపురం : వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన కోసం వారం రోజులుగా వెతుకుతుండగా.. అతను నేరుగా వచ్చి హయత్‌నగర్ కోర్టులో లొంగిపోయాడు. అతనికి ఈనెల 30 వరకు కోర్టు రిమాండ్ విధించింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్‌నగర్ శాఖలో రూ.22.53 లక్షల నగదు మాయంపై వారం రోజుల కిందట వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే అనుకోకుండా సోమవారం అతను కోర్టులో లొంగిపోయాడు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బ్యాంక్‌లోని లోపాలను కప్పిపుచ్చుకునేందుకు తనను దోషిగా చిత్రీకరించారని పేర్కొన్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని, త్వరలోనే బయటికి వచ్చి బయటపెడుతానని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి