Abn logo
Mar 28 2020 @ 23:10PM

భారీ విరాళంపై అక్షయ్ భార్య స్పందన ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత అధికమొత్తంలో ఎవరూ సాయంగా ప్రకటించలేదు. అక్షయ్ కుమార్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ఇంత మొత్తం ప్రకటించడంపై ఆమె భార్య ట్వింకిల్ ఖన్నా ఎలా స్పందించారో తెలుసా?


‘‘నా భర్త రూ.  25 కోట్లు విరాళం ఇచ్చి నేను ఎంతో గర్వపడేలా చేశారు. అయితే ఆయన ఈ విరాళం ప్రకటించే ముందు నేను కూడా ఒకసారి ఆలోచించుకోమని అన్నాను. ఇంత మొత్తం ఇస్తే.. మనకి కూడా కొంత మనీ అవసరం కదా.. అని అన్నాను. దీనికి ఆయన ఏమన్నారంటే.. ‘నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సహాయం చేయకుండా ఎలా ఉండగలను’ అనే సమాధానం ఇచ్చారు..’’ అని ట్వింకిల్ ఖన్నా తన ట్వీట్‌లో తెలిపారు.  


Advertisement
Advertisement
Advertisement