ఈ కవల అక్కాచెల్లెళ్లు మామూలోళ్లు కాదు.. ఆ ఒక్క అడ్వాంటేజ్‌తో ఏకంగా 30సార్లు..

ABN , First Publish Date - 2022-07-01T17:50:04+05:30 IST

ఆ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. అందులోనూ కవలలు. ఇద్దరు అక్క ఎవరు? చెల్లెలు ఎవరు? అని గుర్తుపట్టడం చాలా కష్టం. దాన్నే ఆ ఇద్దరూ అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. అధికారుల కళ్లుగప్పారు. ఒకరు పాస్‌పార్ట్‌పై మరొకరు

ఈ కవల అక్కాచెల్లెళ్లు మామూలోళ్లు కాదు.. ఆ ఒక్క అడ్వాంటేజ్‌తో ఏకంగా 30సార్లు..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. అందులోనూ కవలలు. ఇద్దరు అక్క ఎవరు? చెల్లెలు ఎవరు? అని గుర్తుపట్టడం చాలా కష్టం. దాన్నే ఆ ఇద్దరూ అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. అధికారుల కళ్లుగప్పారు. ఒకరు పాస్‌పార్ట్‌పై మరొకరు పదుల సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. తాజాగా వారి గుట్టు రట్టైంది. దీంతో కిలేడీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన పని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హాంగ్, వేయ్ అనే ఇద్దరు మహిళలు కవలలు. చైనాలోని హర్బిన్ నగరంలో నివసిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు.. ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఎవరు అక్క.. ఎవరు చెల్లి అని గుర్తు పట్టడానికి కూడా వీలులేకుండా ఇద్దరూ ఓకేలా ఉండటాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని.. అధికారులను బోల్తాకొట్టించారు. ఒకరి  పాస్ట్‌ పోర్టును మరొకరు వినియోగించి.. ఏకంగా 30కిపైగా అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. తొలుత హాంగ్ అనే మహిళ తన భర్తతో కలసి.. జపాన్ వెళ్లాల్సి ఉండగా.. ఆమెకు వీసా లభించలేదు. దీతో ఆమె తన సోదరి వేయ్.. పాస్‌పోర్టు, వీసాలను వాడుకుని జపాన్ వెళ్లింది. ఆ తర్వాత కూడా ఆమె ఈ పద్ధతిని కొనసాగించింది.



వేయ్ పాస్‌పోర్ట్‌తో రష్యా, జపాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు ప్రయాణించింది. వేయ్ కూడా హాంగ్ పాస్‌పోర్టును వాడుకుని.. అంతర్జాతీయ ప్రయాణాలు చేసింది. అయితే తాజాగా ఈ అక్కాచెల్లెళ్ల బండారం బయటపడింది. దీంతో చైనా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వార్త చైనా సోషల్ మీడియా‌లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు అధికారుల కళ్లుగప్పినా.. అధునాతన టెక్నాలజీ నుంచి ఎలా తప్పించుకోగలికారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కాచెల్లళ్ల మోసం ఎలా బయటపడింది అనే అంశాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. 


Updated Date - 2022-07-01T17:50:04+05:30 IST