Hyderabad: జంట జలాశయాలకు తగ్గిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-28T13:49:38+05:30 IST

జంట జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది..

Hyderabad: జంట జలాశయాలకు తగ్గిన వరద ప్రవాహం

Hyderabad: జంట జలాశయాల(Twin reservoirs )కు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు 10 గేట్ల ద్వారా మూసీలోకి 6,090 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్(Osmansagar) సామర్థ్యం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1787.55 అడుగులుగా ఉంది. హిమాయత్‌సాగర్(Himayatsagar) ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉండగా, ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1760.50 అడుగులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-28T13:49:38+05:30 IST