‘సోలిపేట’తోనే రెండు పర్యాయాలు ఉపఎన్నిక

ABN , First Publish Date - 2020-09-30T08:25:18+05:30 IST

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వల్లే అప్పటి దొమ్మాట, ఇప్పటి దుబ్బాక నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఉప ఎన్నిక

‘సోలిపేట’తోనే రెండు పర్యాయాలు ఉపఎన్నిక

దుబ్బాక, సెప్టెంబరు 29: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వల్లే అప్పటి దొమ్మాట, ఇప్పటి దుబ్బాక నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక నియోజకవర్గం పునర్‌ విభజనకు ముందు దొమ్మాటగా కొనసాగింది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 2008లో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి ఎన్నికల్లో దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డితో వచ్చిన ఉపఎన్నిక, మళ్లీ ఆయన మరణంతో రెండోసారి దుబ్బాకకు ఉపఎన్నిక జరగనున్నది. దొమ్మాట, దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న క్రమంలో అనివార్యంగా రెండు పర్యాయాలు ఉపఎన్నికను ఆయా పార్టీలు ఎదుర్కొంటున్నాయి. 


నాటి దొమ్మాట- నేటి దుబ్బాక ఎమ్మెల్యేలు వీరే 

1957 - అనంతరెడ్డి (పీడీఎఫ్‌)

1962 - ఖాజామోయినొద్దీన్‌ (కాంగ్రెస్‌)   

1967 - బీంరెడ్డి (స్వతంత్య్ర)  

1972 - ఎస్‌.రాంచంద్రారెడ్డి (కాంగ్రెస్‌)

1978 - ఐరేణి లింగయ్య (కాంగ్రెస్‌)

1983 - ఐరేణి లింగయ్య (కాంగ్రెస్‌)

1985 - డి.రాంచంద్రారెడ్డి(టీడీపీ)

1989 - చెరుకు ముత్యంరెడ్డి(టీడీపీ)

1994 - చెరుకు ముత్యంరెడ్డి(టీడీపీ)

1999 - చెరుకు ముత్యంరెడ్డి(టీడీపీ)

దుబ్బాక నియోజకవర్గ పునర్‌ విభజన అనంతరం 

2004 - సోలిపేట రామలింగారెడ్డి( టీఆర్‌ఎస్‌) 

2008 - సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్‌- ఉపఎన్నిక)

2009 - చెరుకు ముత్యంరెడ్డి (కాంగ్రెస్‌)

2014 - సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్‌)

2018 - సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్‌) 

Updated Date - 2020-09-30T08:25:18+05:30 IST