Kozhikodeలో 7 విమానాల్లో 23 కిలోల బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-03T14:08:49+05:30 IST

కేరళలోని కోజికోడ్‌లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం బుధవారం 23 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది....

Kozhikodeలో 7 విమానాల్లో 23 కిలోల బంగారం స్వాధీనం

23 మంది అరెస్ట్

కోజికోడ్ (కేరళ): కేరళలోని కోజికోడ్‌లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం బుధవారం 23 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకోవడం విశేషమని కస్టమ్స్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.డెసర్ట్ స్టార్మ్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లో 23 కిలోల బంగారాన్ని 23 మంది విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) , కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌ల బృందం తెలిపింది.గల్ఫ్ దేశాల నుంచి కోజికోడ్ చేరుకున్న విమాన ప్రయాణికుల వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. గతంలో కూడా కేరళలోని పలు విమానాశ్రయాల్లో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


 గత ఏడాది ఆగస్టులో కస్టమ్స్ అధికారులు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతను డబుల్ లేయర్డ్ జీన్స్ ధరించాడని, అందులో 14 లక్షల విలువైన బంగారు లేపనం దాచి ఉంచాడని కనుగొన్నారు. బంగారం స్మగ్లర్లు తెలివిగా ఖర్జూర గింజలు, మందపాటి బ్రా పట్టీలు, భారీ బెల్ట్ బకిల్స్, షూ సోల్స్, సాసేజ్‌లు, గోల్డ్ పేస్ట్ లను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.2020వ సంవత్సరంలో కోజికోడ్‌లో ఓ విమాన ప్రయాణికుడి ముఖానికి మాస్క్‌లో బంగారం కనిపించడంతో అతన్ని అరెస్టు చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలు తన బిడ్డతో వస్తూ బంగారంతో చేసిన వాటర్ బాటిల్ పట్టుకుని కనిపించింది.


Updated Date - 2022-02-03T14:08:49+05:30 IST