Jammu and Kashmirలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 27 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-03T13:42:35+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెనపై ఐరన్ షట్టరింగ్ కూలిపోవడంతో 27 మంది కూలీలు గాయపడ్డారు....

Jammu and Kashmirలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 27 మందికి గాయాలు

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెనపై ఐరన్ షట్టరింగ్ కూలిపోవడంతో 27 మంది కూలీలు గాయపడ్డారు.రామ్‌ఘర్-కోల్‌పూర్ వద్ద దేవిక నదిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన వంతెనను నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిపై నిర్మిస్తున్న వంతెన కోసం రెండు స్తంభాలను కలుపుతూ వేసిన ఇనుప షట్టరు ఆకస్మాత్తుగా కూలిపోయింది.గాయపడిన కూలీలను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన కూలీల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక చికిత్స కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. 


నదిపై వంతెనకు కంక్రీట్ స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సహాయ చర్యలు చేపట్టామని సాంబ డిప్యూటీ కమిషనర్ అనురాధ గుప్తా చెప్పారు. రామ్ ఘడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటరు, విజయ్ పూర్ ట్రామాసెంటర్లలో చికిత్స పొందుతున్న కూలీలను అనురాధ పరామర్శించారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.


Updated Date - 2022-01-03T13:42:35+05:30 IST