Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 06:56:38 IST

Afghanistan హెరాత్ సిటీలో పేలుడు...12 మంది మృతి

twitter-iconwatsapp-iconfb-icon
Afghanistan హెరాత్ సిటీలో పేలుడు...12 మంది మృతి

హెరాత్: అఫ్ఘానిస్థాన్ దేశంలోని హెరాత్ నగరంలో జరిగిన పేలుడులో 12మంది మరణించారు. పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ నగరంలోని పీడీ 12 ప్రాంతంలో జరిగిన పేలుడులో 12 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలను క్రీడామైదానంలో పాతిపెట్టడంతో దానిపై యువకులు ఆడుకుంటుండగా పేలిందని అప్ఘాన్ అధికారులు చెప్పారు. ఈ పేలుడుకు కారణం ఎవరనేది ఇంకా తేలలేదు. గత ఏడాది ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా దాడులు, పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో కొన్నింటిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేశారు.హెరాత్ నగరంలో జనవరి నెలలోనూ పేలుడు జరిగింది. నాటి పేలుళ్లలో ఏడుగురు మరణించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.