పన్నెండు కోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలు.. రూ. 300 కోట్ల ఛార్జీలు వసూలు...

ABN , First Publish Date - 2021-04-16T01:09:50+05:30 IST

జన్ ధన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే... బ్యాంకులు రూ. 20 వరకు చార్జీలను వసూలు చేస్తున్నాయి.

పన్నెండు కోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలు.. రూ. 300 కోట్ల ఛార్జీలు వసూలు...

ముంబై : జన్ ధన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే... బ్యాంకులు రూ. 20 వరకు చార్జీలను వసూలు చేస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోన్న పథకాల్లో జన్ ధన యోజన కూడా ఒకటి. ప్రతీ పేదవాడికి కూడా బ్యాంక్ ఖాతా ఉండాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ఈ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద జన్‌ధన్ ఖాతా తెరవచ్చు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. 


అంటే... ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ ఖాతా. ఈ ఖాతా నుంచి బ్యాంకులు ఎలాంటి చార్జీలూ వసూలు చేయబోవు. అయితే... ఉచిత లావాదేవీల పరిమితి దాటనంత వరకు మాత్రమే ఎటువంటి చార్జీలూ పడవు. ఇక... పరిమితి దాటితే మాత్రం చార్జీలు చెల్లించుకోక తప్పదు. నెలకు నాలుగు ఉచిత లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ పరిమితి దాటినపక్షంలో... ఆపై ప్రతీ లావాదేవీకి రూ. 20 వరకు చార్జి పడుతుంది.


యూపీఐ, డిజిటల్ లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్... ఎస్‌బీహెచ్ ఇటవంటి లావాదేవీలకు రూ. 17.70 చొప్పున వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ... 2015 నుంచి 2020 వరకు ఐదేళ్ల కాలంలో 12 కోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి ఏకంగా రూ. 300 కోట్లను ఇలా చార్జీల రూపంలో వసూలు చేసింది. ఐఐటీ బాంబే నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

Updated Date - 2021-04-16T01:09:50+05:30 IST