టీవీఎస్ ఉద్యోగులకు షాక్.. వేతనాల్లో కోతలకు నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-26T23:40:58+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు సంస్థలు ఉద్యోగులను తొలగించడమో, వేతనాల్లో కోత

టీవీఎస్ ఉద్యోగులకు షాక్.. వేతనాల్లో కోతలకు నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు సంస్థలు ఉద్యోగులను తొలగించడమో, వేతనాల్లో కోత విధించడమో చేస్తూ కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడా కోవలోకి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ చేరింది. సంస్థలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 15-20 శాతం కోత విధించాలని నిర్ణయించింది. మే నుంచి అక్టోబరు వరకు కోతలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, కార్మికస్థాయి ఉద్యోగుల్లో మాత్రం ఎటువంటి కోత ఉండదని స్పష్టం చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 5 శాతం, యాజమాన్యస్థాయి ఉద్యోగుల వేతనంలో గరిష్టంగా 20 శాతం కోత విధించనున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-26T23:40:58+05:30 IST