'రీటైలర్‌ కనక్ట్‌' ప్రచారాన్ని ప్రారంభించిన టీవీఎస్ క్రెడిట్

ABN , First Publish Date - 2022-07-14T22:33:17+05:30 IST

చిన్న, మధ్య తరహార రీటైలర్ల అవసరాలు తీర్చేందుకు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ టీవీఎస్ క్రెడిట్‌ కొత్తగా 'రీటైలర్‌

'రీటైలర్‌ కనక్ట్‌' ప్రచారాన్ని ప్రారంభించిన టీవీఎస్ క్రెడిట్

చెన్నై: చిన్న, మధ్య తరహార రీటైలర్ల అవసరాలు తీర్చేందుకు  ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ టీవీఎస్ క్రెడిట్‌ కొత్తగా 'రీటైలర్‌ కనెక్ట్‌' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. మూలధనం రుణాలు, తాకట్టు లేని వ్యాపార రుణాలు, స్టాక్‌ కొనుగోలు ఫైనాన్సింగ్‌ వంటి తమ రీటైలర్‌ లోన్‌ ఆఫరింగ్స్‌ గురించి అవగాహన కలిగించడానికి దీన్ని ప్రారంభించినట్లు టీవీఎస్ క్రెడిట్ తెలిపింది.


వచ్చే కొద్ది వారాల్లో ఈ కార్యక్రమం ద్వారా దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలలో లక్ష రీటైలర్స్‌తో సంబంధాన్ని కలిగి ఉండాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్టు టీవీఎస్ క్రెడిట్  సీఆర్‌ఎం మార్కెటింగ్‌ హెడ్‌ చరణ్‌ దీప్‌ సింగ్‌ తెలిపారు. వినియోగదారుల అభిలాష నిజం చేసేందుకు సకాలంలో, అనువైన క్రెడిట్‌తో సాధికారత కల్పించే లక్ష్యంతోనే ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.


ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఎక్కువ డాక్యుమెంట్లతో పనిలేకుండానే తాను లోన్ పొందగలిగినట్టు చెన్నైకి చెందిన సుభాష్ స్టోర్ అధినేత సురేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 'రీటైలర్‌ కనెక్ట్‌' ప్రచారం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో జరుగుతున్నట్టు టీవీఎస్ క్రెడిట్ తెలిపింది. టీవీఎస్ క్రెడిట్ ద్వారా ద్విచక్ర వాహన రుణాలు, యూజ్డ్ కారు,  ట్రాక్టర్, యూజ్డ్ వాణిజ్య వాహనాల రుణాలు, వ్యాపార రుణాలు, వినియోగదారు రుణాలు, పర్సనల్ లోన్స్ సహా ఇతర లోన్స్ అందిస్తోంది.

Updated Date - 2022-07-14T22:33:17+05:30 IST