సంక్రాంతి వేడుకల్లో టీవీ యాంకర్‌ లాస్య

ABN , First Publish Date - 2021-01-16T05:04:18+05:30 IST

టీవీయాంకర్‌, బిగ్‌బాస్‌-4 సెలబ్రిటీ లాస్య సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

సంక్రాంతి వేడుకల్లో టీవీ యాంకర్‌ లాస్య

వీరబల్లి, జనవరి 15: టీవీయాంకర్‌, బిగ్‌బాస్‌-4 సెలబ్రిటీ లాస్య సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.  వీరబల్లి మండలం గడికోట స్వగ్రామానికి రెండు రోజుల ముందు చేరుకున్నారు. ఇదే మండలం వంగిమల్ల గ్రామం కావలిగడ్డలోని సమీ ప బంధువులు అయిన చింతల రవీంద్రారెడ్డి, దేవేంద్రనాథ్‌రెడ్డి స్వగృహానికి విచ్చేసి శుక్రవారం జరిగిన కనుమ పండుగ సంబరాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని పలువురి గ్రామస్థులను  కలుసుకుని ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా అనేక మంది యువతీయువకులు సెల్పీలు కూడా తీసుకున్నారు. కనుమలో భాగంగా ఏర్పాటు చేసిన చిట్లాకుప్పలు దగ్గర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో లాస్య భర్త మంజునాధ్‌, కుమారుడు దక్షి, సోదరుడు వీరబల్లి శివకుమార్‌రెడ్డి, సమీప బంధువులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.


Updated Date - 2021-01-16T05:04:18+05:30 IST