Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 28 Jan 2022 12:52:53 IST

దేవుడిపై అభ్యంతరకర కామెంట్స్.. నటి శ్వేతపై నెటిజన్ల ఫైర్.. ఎఫ్ఐఆర్ నమోదు

twitter-iconwatsapp-iconfb-icon
దేవుడిపై అభ్యంతరకర కామెంట్స్.. నటి శ్వేతపై నెటిజన్ల ఫైర్.. ఎఫ్ఐఆర్ నమోదు

హిందీ టెలివిజన్ నటి శ్వేత తివారి దేవుడి గురించి అభ్యంతరకర కామెంట్స్ చేసి కాంట్రవర్సీలో ఇరుక్కుంది. దీంతో మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశాల మేరకు ఈ నటిపై భోపాల్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


నటి శ్వేత ప్రస్తుతం ‘మహాభారతం’ టీవీ సిరీస్‌లో కృష్ణుడిగా నటించిన సౌరభ్ జైన్‌తో కలిసి ‘షో స్టాపర్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో సౌరభ్ జైన్‌ బ్రా ఫిట్టర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్వేత ఈ షోకి సంబంధించి టీంతో కలిసి భోపాల్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇదే సమయంలో వారిని ‘శ్రీకృష్ణుడిగా నటించిన సౌరభ్ జైన్‌తో బ్రా ఫిట్టర్ పాత్రను చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది..?’ అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే శ్వేత రియాక్టయింది.


‘దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు’.. అంటూ వెటకారంగా నవ్వుతూ శ్వేత అభ్యంతరకర కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమాల్లో పాత్రలకు, దేవుడికి లింక్ పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పోలిక అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ వీడియో కాస్తా మధ్యప్రదేశ్ హోం మంత్రి దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 24 గంటల్లో రిపోర్టు ఇవ్వాలని పోలీసులను ఆయన ఆదేశించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...