Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 09 Jan 2022 11:45:40 IST

Hina Khan : 24 గంటలూ మాస్క్ ధరించిన నటి ముఖానికి... చివరకు ఏమైందంటే...

twitter-iconwatsapp-iconfb-icon
Hina Khan : 24 గంటలూ మాస్క్ ధరించిన నటి ముఖానికి... చివరకు ఏమైందంటే...

కోవిడ్ కష్టాలు ఎవ్వర్నీ వదలటం లేదు. ఇక సినిమా, టీవీ నటీనటుల్ని అయితే మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కసారి కరోనా బారిన పడితే తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా కారణంగా మిగతా వారికి ఆరోగ్యం మాత్రమే పాడవుతుంది. యాక్టర్స్‌కి గ్లామర్ గండం కూడా దాపురిస్తుంటుంది. అందం తిరిగి పొందాలంటే మళ్లీ ఎంతో చెమటోడ్చాల్సి వస్తుంది.

Hina Khan : 24 గంటలూ మాస్క్ ధరించిన నటి ముఖానికి... చివరకు ఏమైందంటే...

హిందీ సీరియల్స్‌లో నటిస్తూ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బుల్లితెర స్టార్ బ్యూటీ హీనా ఖాన్. ఈ అందగత్తె పరిస్థితి కూడా ప్రస్తుతం కరోనా కారణంగా క్లిష్టంగా మారింది. లక్కీగా హీనాకు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ అయితే రాలేదు. కానీ, ఆమె ఇంట్లో మిగతా వారందరికీ మహమ్మారి సోకింది. మరి తన పరిస్థితి ఏంటి? ఎప్పుడూ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తూ బిజీగా ఉండే హీనా వైరస్ బారిన పడితే షూటింగ్ డేట్స్ వేస్ట్ అవుతాయి. అందుకే, జాగ్రత్తగా తనని తాను కాపాడుకుంటోంది హీనా. కానీ, ఆ క్రమంలో ఆమె ముఖంపై మాస్క్ ఒత్తిడి తప్పలేదట!


‘‘ఇంట్లో అందరూ కోవిడ్-19 పాజిటివ్... మీరొక్కరే నెగటివ్‌గా ఉన్నప్పుడు... మాస్కులు, శానిటైజర్లతో సన్నద్ధం కావటం తప్ప మరో మార్గం ఏదీ ఉండదు. కానీ, ఆ క్రమంలో 24/7 మాస్కుల వల్ల ముఖం మీద ఇలాంటి మరకలు తప్పవు మరి...’’ అంటోంది హీనా ఖాన్. ఆమె సొషల్ మీడియాలో తన తాజా ఫోటోల్ని షేర్ చేసింది. వాటిల్లో ఆమె ముఖం మీద మనం స్పష్టంగా ఎర్రటి మరకల్ని గమనించవచ్చు. ఆ కమిలిపోయిన చర్మం 24 గంటలూ మాస్క్ ధరించటం వల్లేనట! 


‘‘మరకలు, యుద్ధ చిహ్నాలతో... మరోసారి పోరాటం చేద్దాం రండి...’’ అని హీనా ఖాన్ తన ఫాలోయర్స్‌కి పిలుపునిచ్చింది కూడా. ఆమె చెప్పినట్టు కాస్త ఇబ్బందిపడుతూ అయినా మాస్కులు ధరించటమే... ఇప్పుడు అందరి కర్తవ్యం కూడా... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement