Abn logo
Aug 11 2020 @ 19:44PM

దేవుడా సుశాంత్ కేసులో దోషులను కఠినంగా శిక్షించు: అర్జున్ బిజ్లానీ

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని టీవీ నటుడు అర్జున్ బిజ్లానీ దేవుడిని వేడుకున్నారు. సుశాంత్‌కు జరిగిన అన్యాయాన్ని మర్ఛిపోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశారు. కళ్లు మూసుకుని, చేతులు జోడించి ఉన్న తన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘సుశాంత్‌‌ను మర్చిపోలేకపోతున్నాను. అతడికి జరిగిన అన్యాయం ప్రతి క్షణం గుర్తుకొస్తోంది. అతడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించు దేవుడా..’అంటూ భావోద్వవేగంగా రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇంతకుముందు కూడా అర్జున్ ఓ ఫొటోను షేర్ చేశాడు. సుశాంత్‌ విషయంలో అసలేం జరిగిందో అందరికీ తెలియాలంటూ వెలుగుతున్న క్యాండిల్‌ ఫోటోను షేర్ చేశాడు.


Advertisement
Advertisement
Advertisement