- ఎన్నికల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు
చెన్నై, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): డీఎంకే సీనియర్ నాయకురాలు, తూత్తుకుడి ఎంపీ కనిమొళి(Thoothukudi MP Kanimozhi)కి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2019లో ఆమె ఎన్నిక ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్టే తొలగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ స్టే కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కనిమొళి విజయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే హైకోర్టులో విచారణ నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ కనిమొళి 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సర్వోన్నత న్యాయస్థానం ఆమె అభ్యర్థనను మన్నించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై శుక్రవారం మళ్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ హాజరై వాదనలు వినిపించారు. స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించిన కనిమొళి ఎన్నికపై విచారణ జరపడం వల్ల ఆమె మనస్తాపం చెందుతారని, దీనివల్ల విజయవంతమైన తన పిటిషనర్‌కు తీరని నష్టం కలుగుతుందని వివరించారు. అందువల్ల హైకోర్టు(High Court) విచారణపై గతంలో విధించిన స్టే కొనసాగించాలని అభ్యర్థించారు. ఆయన వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్టే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి