5 కోట్లలోపు టర్నోవర్‌.. ప్రతి నెలా 35% టాక్స్‌

ABN , First Publish Date - 2021-03-05T08:44:59+05:30 IST

వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు, ట్రేడర్లు ఇకపై వస్తుసేవల

5 కోట్లలోపు టర్నోవర్‌.. ప్రతి నెలా 35% టాక్స్‌

వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు, ట్రేడర్లు ఇకపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను గత త్రైమాసికంలో చెల్లించిన మొత్తం పన్ను ఆధారంగా ఒక్కో నెలలో 35 శాతం వరకైనా మూడు నెలలపాటు చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ ఆదేశించింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.5 కోట్లలోపు టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు ఇప్పటివరకు మూడు నెలలకోసారి రిటర్నులను దాఖలు చేసి ఒక్కో నెలలో అమ్మకాలు, కొనుగోళ్ల ఆధారంగా ఎంతో కొంత జీఎస్టీ చెల్లించేవారు.


ఇప్పుడు ప్రతి నెలా కనీసం 35 శాతం మేరనైనా చెల్లించాలని కొత్తగా నిబంధన పెట్టారు. గత త్రైమాసికంలో చెల్లించిన జీఎస్టీ మొత్తాన్ని ఆధారంగా చేసుకుని 35 శాతం మొదటి నెలలో, మరో 35 శాతం రెండో నెలలో, మిగతా మొత్తం మూడో నెలలో చెల్లించాలని పేర్కొన్నారు.


Updated Date - 2021-03-05T08:44:59+05:30 IST