తిప్పేసిన షకీబల్‌

ABN , First Publish Date - 2021-01-21T09:45:33+05:30 IST

వెస్టిండీ్‌సతో మూడు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో బంగ్లా 6 వికెట్లతో గెలిచింది.

తిప్పేసిన షకీబల్‌

ఢాకా: వెస్టిండీ్‌సతో మూడు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో బంగ్లా 6 వికెట్లతో  గెలిచింది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన షకీబల్‌ హసన్‌ (4/8) నాలుగు వికెట్లతో చెలరేగడంతో.. విండీస్‌ 32.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. కైల్‌ మేయర్స్‌ (40) టాప్‌ స్కోరర్‌. హసన్‌ మహ్మద్‌ 3, ముస్తాఫిజుర్‌ 2 వికెట్లు తీశారు. ఛేదనలో కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (44), షకీబల్‌ (19 నాటౌట్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (19 నాటౌట్‌) రాణించడంతో బంగ్లా 33.5 ఓవర్లలో 125/4 స్కోరు చేసి గెలుపొందింది. 

Updated Date - 2021-01-21T09:45:33+05:30 IST