Advertisement
Advertisement
Abn logo
Advertisement

పసుపులో ఇన్ని ఔషధ గుణాలా...

ఆంధ్రజ్యోతి(02-04-2020)


డయాబెటీస్ దూరం 

పసుపు సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేస్తుంది. చిటికెడు పసుపు వేస్తేనే కూరకి రంగుతో పాటు రుచీ వస్తుంది. ఇవి అందరికీ తెలిసిన సంగతులే! పసుపులో అందరికీ తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం పసుపు నీళ్ళు క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్2 డయాబెటిస్‌ను నివారించవచ్చని తేలింది. పసుపులో ఉండే కుర్కుమిన్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, మతిమరుపు వంటి లక్షణాలను నివారిస్తుంది. ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ ఫంక్షన్స్ లోపాలను, మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అలాగే పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బులని కూడా దరిచేరనివ్వవు. 

               పసుపులో కేన్సర్‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. కేన్సర్‌కి సంబంధించిన ట్యూమర్ల పెరుగుదలను, కేన్సర్ కణాల విస్తరణను కర్కుమిన్ అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది.

Advertisement
Advertisement