24ఏళ్ల యువతికి తీవ్ర కడుపు నొప్పి.. వెంటనే ఆసుపత్రికి తరలింపు.. వైద్య పరీక్షల్లో బయటపడ్డ నిజం.. వైద్యుల మైండ్ బ్లాంక్!

ABN , First Publish Date - 2022-07-21T15:48:28+05:30 IST

ఆ యువతికి 24ఏళ్లు. అప్పటి వరకు బాగానే ఉంది. ఇంతలో ఉన్నట్టుండి కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ నొప్పికాస్తా తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయింది. కడుపు పట్టుకుని బాధపడుతున్న ఆమె

24ఏళ్ల యువతికి తీవ్ర కడుపు నొప్పి.. వెంటనే ఆసుపత్రికి తరలింపు.. వైద్య పరీక్షల్లో బయటపడ్డ నిజం.. వైద్యుల మైండ్ బ్లాంక్!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి 24ఏళ్లు. అప్పటి వరకు బాగానే ఉంది. ఇంతలో ఉన్నట్టుండి కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ నొప్పికాస్తా తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయింది. కడుపు పట్టుకుని బాధపడుతున్న ఆమెను చూసి స్థానికులు తట్టుకోలేకపోయారు. దీంతో ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అందులో అసలు విషయం బయటపడటంతో డాక్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా.. ఇంతకూ ఎం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



టర్కీలోని వాన్ ప్రావిన్స్(Van Province)కు చెందిన 24ఏళ్ల యువతి మానసిక సమస్యలతో బాధపడుతోంది. రోడ్లపై ఎప్పుడూ తిరుగుతూ కనిపించే ఈ యువతికి అకస్మాత్తుగా కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ నొప్పి తీవ్ర అయింది. నొప్పి తాలలేక కడుపు పట్టుకుని బాధపడుతున్న ఆ యువతిని చూసి స్థానికులు చలించిపోయారు. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి వైద్య సిబ్బంది చేరుకుని ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. తర్వాత వైద్య పరీక్షల్లో బయటపడ్డ వాస్తలు తెలిసి కంగుతిన్నారు. ఆమె పొట్టలో 158 రకాల మెటల్ వస్తువులు ఉన్నట్టు గుర్తించి విస్తుపోయారు. అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మానసిక స్థితి సరిగా లేనందున.. మెటల్ వస్తువులను ఆమె మింగేసి ఉంటుందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ఆమె పొట్టలోంచి.. మేకులు, తాళాలు వంటి రకరకాల పరిమాణాలో ఉన్న ఇనుప వస్తువులను తొలగించినట్టు వెల్లడించారు. 


Updated Date - 2022-07-21T15:48:28+05:30 IST