గుంటూరు అబ్బాయి.. టర్కీ అమ్మాయి.. వైరల్ వెడ్డింగ్!

ABN , First Publish Date - 2021-12-30T21:46:22+05:30 IST

గుంటూరు అబ్బాయిని మనువాడిన టర్కీ అమ్మాయి..వైరల్ వెడ్డింగ్

గుంటూరు అబ్బాయి.. టర్కీ అమ్మాయి.. వైరల్ వెడ్డింగ్!

ఇంటర్నెట్ డెస్క్: మధు సంకీర్త్..మన తెలుగు కుర్రాడే. స్వస్థలం గుంటూరు! ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. ఆమెమో టర్కీ జాతీయురాలు.. పేరు గిజెమ్. అక్కడే పుట్టి పెరిగింది. ఆమె మన గుంటూరు కుర్రాడికి సహోద్యోగి. ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించి..మంగళవారం గుంటూరులో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరి వివాహాం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 


2016లో ఈ జంట ప్రణయప్రయాణం ప్రారంభమైంది. 2020లో వారు వివాహం చేసుకోవాలనుకున్నా.. కరోనా ఆంక్షల కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా వారు తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో జాతి, కుల, మత, భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-12-30T21:46:22+05:30 IST