బురేవి తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-12-06T03:28:58+05:30 IST

బురేవి తుఫాన్‌ ప్రభావంతో శ నివారం మండలంలో భారీ వర్షం కురిసింది. వెంకటాచలం, తిక్కవర ప్పాడు, సర్వేపల్లి, ఇస్క

బురేవి తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు
ఇందుకూరుపేటలో నీట మునిగిన వరినాట్లు

వెంకటాచలం, డిసెంబరు 5 : బురేవి తుఫాన్‌ ప్రభావంతో శ నివారం మండలంలో భారీ వర్షం కురిసింది. వెంకటాచలం, తిక్కవర ప్పాడు, సర్వేపల్లి, ఇస్కపాళెం, నిడిగుంటపాళెం, గూడ్లూరువారిపాళెం, తాటిపర్తిపాళెం, ఎగువమిట్ట, పూడిపర్తి, ఈదగాలి, ఇడిమేపల్లి, అనికే పల్లి, కంటేపల్లి, కాకుటూరు, చెముడుగుంట, కనుపూరు, కసుమూరు, కురిచెర్లపాడు, పాలిచెర్లపాడు తదితర గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వర్షం కురిసింది. దీంతో కొన్ని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


అప్రమత్తంగా ఉండాలి

 మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్థార్‌ ఐఎస్‌ ప్రసాద్‌ సూచించారు. వెంక టాచలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన శనివారం మాట్లా డారు. ప్రస్తుతం బురేవి తుఫాన్‌ వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. 


 అధికారులపై ఆగ్రహం

ఇందుకూరుపేట, డిసెంబరు 5 : మండలంలో మూడు వారా లుగా  వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరిపైరుకు నష్టం లేద ని అధికారులు చెప్పడంపై రైతులు ఆగ్రహిస్తున్నారు. పెన్నానది సై తం పొంగి గ్రామాలను చుడితే, వరిపైర్లు, నార్లు మునగలేదని మం డల వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. దాదాపు ఏడు వేల హెక్టార్లలో పైర్లు, నార్లు ఉంటే 50 లేదా 60 ఎకరాలు మాత్రమే న ష్టం అని అధికారులు ప్రకటించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నష్టాలను అధికారులు గుర్తించలేదని వారంటున్నారు. అస లు గ్రామాల్లో చూడకుండా ఆఫీసుల్లో కాగితాలు రాసుకున్నారని  వా రు విమర్శించారు.


 కుండపోతగా వర్షం

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు5: మండలంలో శనివారం నుంచి  కురుస్తున్న  కుండపోత వర్షానికి వరినాట్లు, నారుమళ్లు చెరువులను తలపిస్తుండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వరదలొచ్చి పంట లు ముంచినా... లేక వరదలొస్తాయని వరినాట్లు వేయకపోయినా రెండు విధాలా రైతులకు నష్టమే. నాట్లు వేయకుంటే నార్లు ముదిరిపోయి పనికిరాకుండా పోతాయి.. అదీ కాక అదును తప్పిపోతుంది. నాట్లు వేసిన తరువాత మళ్ళీ వరదలొచ్చి వరినాట్లు మునిగినా నష్ట మే. దీంతో నారు ముదిరిపోకముందే వర్షాలను కూడా లెక్కచేయకుండా వరినాట్లు వేసుకుంటూ పైరును కాపాడే భారం భగవంతుడిపై వేస్తున్నారు.


 పశుసంపద, జీవాలు నష్టపోతే తెలపండి

 మండలంలో పశుసంపదకు గానీ, సన్న జీవాలకు గానీ ఎలాంటి నష్టం జరిగినా దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలలో సమాచారం ఇవ్వాలని బుచ్చి ప్రాంతీయ పశువైధ్యాధికారి డాక్టర్‌ బి. మురళికృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 


 లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయం

కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, రోడ్లు సైతం వర్షం నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని నివాసాలకు చెందిన వారు ఇళ్ళలోనుంచి బయటకు వచ్చే అవకాశం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.


 మనుబోలులో..

 మనుబోలు, డిసెంబరు 5: బురేవి తుఫాన్‌ ప్రభావంతో శని వారం జోరువర్షం కురిసింది. జల్లులు జల్లులుగా వర్షం పడుతూనే ఉండడంతో పాటు ఎగువ నుంచి కండలేరు జలాలు మనుబోలు చె రువుకు చేరాయి. ఇప్పటికే చెరువుకు ఉన్న మూడు చె క్కలు ఎత్తి నీ టిని కిందకు వదులుతున్నారు. అయినప్పటికీ చెరువు నిండుకుం డలా మారింది. మరో పక్క మనుబోలు రహదారిపై చప్టావద్ద కండ లేరు ప్రవాహం ఎక్కువై రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో గ్రామంలో గూడూరు,నెల్లూరు మార్గాల నుంచి రెండురోజులగా రాకపోకలు ఆగిపోయాయి. మండలంలో తీరప్రాంతగ్రామాల చెరువులకు వెళ్ళే కల్లేరు, మాలేరు వాగులు పొంగిపారుతున్నాయి. మండలంలో 13.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2020-12-06T03:28:58+05:30 IST