తొలి మహిళా ప్రధానిగా జియోఫిజిక్స్ ప్రొఫెసర్

ABN , First Publish Date - 2021-10-01T01:04:47+05:30 IST

హిచెమ్ మెచిచి ఇంతకుము ట్యునీషియా ప్రధానమంత్రిగా పని చేశారు. జూలై 25న హిచెమ్ ప్రభుత్వంతో పాటు పార్లమెంట్‌ను సైతం అధ్యక్షుడు సయీద్ రద్దు చేశారు. తాజాగా ప్రధానిగా విద్యాశాఖ తరపున ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టులు నిర్వహించిన జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ నజ్లా బౌడెన్ రమధానెను..

తొలి మహిళా ప్రధానిగా జియోఫిజిక్స్ ప్రొఫెసర్

ట్యూనిస్ సిటీ: ట్యునీషియాకు మొట్ట మొదటి మహిళ ప్రధానమంత్రి అయ్యారు. జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన నజ్లా బౌడెన్ రమధానె(63)ను ప్రధానిగా నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఖాయిస్ సయీద్ ప్రకటించారు. ట్యునీషియాలో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను అధ్యక్షుడు సయీద్‌నే రద్దు చేశారు. అనంతరం న్యాయవ్యవస్థను కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అయితే అధికారాలన్ని హస్తగతం చేసుకుంటున్నారని విదేశాల నుంచి ఒత్తిడి రావడంతో ప్రధాని ఎంపికను వేగవంతం చేశారు.


హిచెమ్ మెచిచి ఇంతకుము ట్యునీషియా ప్రధానమంత్రిగా పని చేశారు. జూలై 25న హిచెమ్ ప్రభుత్వంతో పాటు పార్లమెంట్‌ను సైతం అధ్యక్షుడు సయీద్ రద్దు చేశారు. తాజాగా ప్రధానిగా విద్యాశాఖ తరపున ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టులు నిర్వహించిన జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ నజ్లా బౌడెన్ రమధానెను నియమించారు. అత్యవసర సమయాల్లో దేశంలోని వ్యవస్థలన్నీ అధ్యక్షుడి పరిధిలోకి వస్తాయని సయీద్ ప్రకటించారు. దీంతో గతంలో ఉన్న ప్రధాని కంటే ప్రస్తుత ప్రధాని అధికారాలు స్వల్పమైనవనేనని అనుకుంటున్నారు.

Updated Date - 2021-10-01T01:04:47+05:30 IST