‘అక్రమాలు, స్కాముల చరిత్ర నాకు లేదు’

ABN , First Publish Date - 2021-02-26T05:35:32+05:30 IST

తుని, ఫిబ్రవరి 25: ‘రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను, 40ఏళ్ల జీవితంలో అక్రమాలు, స్కాములు చేసిన చరిత్ర నాకు లేదు’ అని టీడీపీ తుని

‘అక్రమాలు, స్కాముల చరిత్ర నాకు లేదు’
విలేకర్లతో మాట్లాడుతున్న యనమల కృష్ణుడు

తుని, ఫిబ్రవరి 25: ‘రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను, 40ఏళ్ల జీవితంలో అక్రమాలు, స్కాములు చేసిన చరిత్ర నాకు లేదు’ అని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తొండంగి ప్రాంతంలో రైతుల పేరున తప్పుడు పత్రాలు సృష్టించి గండేపల్లి సొసైటీలో అక్రమంగా రుణాలు పొందిన నాయకులు, అధికారులపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో విచారించి రైతులకు న్యాయం చేయాలన్నారు. లేని ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, తన గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. 

Updated Date - 2021-02-26T05:35:32+05:30 IST