Abn logo
Sep 23 2021 @ 08:56AM

శిథిలావస్థలో తుంగభ్రద వంతెన

చుండూరు: చుండూరులో తుంగభద్ర డ్రెయిన్‌ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. భట్టిప్రోలు - గుంటూరు వయా బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు మార్గంలో ఉన్న ఈ వంతెనను 1931లో బ్రిటీష్‌ వారు నిర్మించారు. భట్టిప్రోలు ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లడానికి ఇది దగ్గర మార్గం కావడంతో విశాలమైన రోడ్డు, వంతెనలు నిర్మించారు. చుండూరు వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 15 గ్రామాల వారికి గుంటూరు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. రెండేళ్ల క్రితం ఈ వంతెన ఐదు చోట్ల కుంగిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు లక్షల రూపాయ లు ఖర్చు చేసి తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకున్నారు. తిరిగి వారం రోజుల నుంచి ఈ వంతెనపై అక్కడక్కడ కుంగి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దీనితో వంతెనపై వాహనాలు రాకపోకలు ప్రమాదంగా మారింది. దీనిపై ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలాం టి ప్రమాదాలు జరగకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption