కోటలోకి ప్రవేశించిన Tungabhadra Water

ABN , First Publish Date - 2022-07-16T18:06:15+05:30 IST

తుంగభద్రమ్మ శుక్రవారం మరింత పోటెత్తి కంప్లి కోటలోకి నీరు ప్రవేశించాయి. ఎన్నడూలేని వి ధంగా 1.40 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండటంతో పూర్తిగా

కోటలోకి ప్రవేశించిన Tungabhadra Water

కంప్లి(బెంగళూరు), జూలై 15: తుంగభద్రమ్మ శుక్రవారం మరింత పోటెత్తి కంప్లి కోటలోకి నీరు ప్రవేశించాయి. ఎన్నడూలేని విధంగా 1.40 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండటంతో పూర్తిగా కోటలోకి నీరు ప్రవేశించాయి. నీరు అధికంగా వస్తుండటంతో ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చెరుకు, అరటి తోటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. రైతులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని కోరారు. హంపిలో కూడా మండపాలు కూడా నీటమునిగాయి. ఎన్నడూలేని మాదిరిగా జలాశయంలో నుంచి నీరు ప్రవహిస్తుండటంతో నది ఒడ్డున వుండే ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-16T18:06:15+05:30 IST