Tungabhadra ఆయకట్టుకు ఈ నెలలో నీరు విడుదల సాధ్యమేనా...?

ABN , First Publish Date - 2022-06-02T17:16:19+05:30 IST

ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల రైతులకు ప్రాణధార అయిన తుంగభద్ర జలాశయం నుంచి ఆయకట్టుకు ఈ ఏడాది జూన్‌లోనే నీరు విడుదల చేస్తామని ఆంధ్ర, కర్ణాటక

Tungabhadra ఆయకట్టుకు ఈ నెలలో నీరు విడుదల సాధ్యమేనా...?

- నీరిస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు

- కాలువల ఆధునికీకరణ పనులతో ఆలస్యం కావచ్చంటున్న అధికారులు


బళ్లారి(బెంగళూరు): ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల రైతులకు ప్రాణధార అయిన తుంగభద్ర జలాశయం నుంచి ఆయకట్టుకు ఈ ఏడాది జూన్‌లోనే నీరు విడుదల చేస్తామని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి. గత పదేళ్ల నీటి లభ్యతతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మే నెలలో 37 టీఎంసీల నీరు చేరింది. మేలో తొలుత నీటి లభ్యత జోరుగా ఉన్నా తరువాత కాస్త మందగించింది. ఒక వేల జూన్‌ తొలి వారంలో తుంగభద్రకు నీటి లభ్యత పెరిగితే జలాశయం నుంచి కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల్లో సుమారు రూ.45 కోట్లతో అధునికీకరణ పనులు జరుగుతున్నాయి. పైగా మే నెలలో వర్షాలు బాగా కురవడంతో కాలువల్లో నీరు చేరి పనులుకు తీవ్ర ఆటంకం కలిగింది. కాంట్రాక్టర్లు నీటిని పెద్దపెద్ద మోటర్ల ద్వారా తోడి వారం క్రితమే పనులు ప్రారంభించారు. మరికొన్ని పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో జూన్‌ నెలలో ఆయకట్టకు నీరు విడుదల సాధ్యం కాకపోవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పైగా జూన్‌లో నీరు విడుదల చేయాలంటే ముందుగానే ఆయకట్టు రైతులకు సూచనలు ఇవ్వాలి. నార్లు వేసుకుంటేనే నాట్లు వేసుకునేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఖరీఫ్ కు నీరు విడుదల చేయిస్తామని అనంతపురంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇది సాధ్యం కాదని అధికారుల పేర్కొంటున్నారు. జూన్‌ తొలివారంలో వానలు వస్తే పనులకు మళ్లీ ఆటంకం కలుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జూలై రెండో వారంలో తుంగభద్ర జలాశయం నుంచి కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-02T17:16:19+05:30 IST