Tungabhadraకు తగ్గిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-06-12T17:30:46+05:30 IST

తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గిం ది. డ్యాం పై ప్రాంతంలో గత వారం నుంచి వర్షాలు కురవక పోవడంతో నీటి చేరిక బాగా తగ్గిందని

Tungabhadraకు తగ్గిన ఇన్‌ఫ్లో

బళ్లారి(బెంగళూరు), జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గింది. డ్యాం పై ప్రాంతంలో గత వారం నుంచి వర్షాలు కురవక పోవడంతో నీటి చేరిక బాగా తగ్గిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 2,635 క్యూసెక్కులు కాగా ఇందులో నుంచి వివిధ కాలువల ద్వారా 275 క్యూసెక్కులు బయటక వదులుతున్నారు. వారం రోజుల క్రితం వానలు బాగా కురిస్తాయని జూన్‌ రెండో వారానికంతా 50 టీఎంసీలు చే రితే కాల్వలకు విడుదల చేయాలని అధికారులు అంచనా వేశారు. కానీ అనుకు న్న రోజుల్లో వర్షాలు కురవక పోవడంతో వాయిదా వేసుకున్నారు. గత ఏడాది ఇదే నాటికి డ్యాంలో 9 టీఎంసీల నీరు మాత్రమే ఉండేదని, కానీ ఈ ఏడాది 40 టీఎంసీల చేరడంతో కొంత మంచి పరిణామనమే అని అధికారులు అంటున్నారు. మరో 10 టీఎంసీల చేరితే 50 టీఎంసీలకు చేరుతుంది. బచావత్‌ అవార్డు ప్రకారం 50 టీఎంసీల నీరు డ్యాంలో చేరితే ఖరీఫ్‌ సాగుకు ఇబ్బంది ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-06-12T17:30:46+05:30 IST