నిండుకుండలా తుంగభద్ర జలాశయం

ABN , First Publish Date - 2022-07-11T13:18:23+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. జలాశయంలోకి భారీగా వరద నీరు...

నిండుకుండలా తుంగభద్ర జలాశయం

Kurnool: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)  నిండుకుండలా మారింది. జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ఇన్‌ఫ్లో 92,160 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 423 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633.00 ఉండగా, ప్రస్తుతం 1628.30 అడుగులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 87.816 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-11T13:18:23+05:30 IST