Tungabhadraలోకి ఉరకలేస్తున్న వరద నీరు

ABN , First Publish Date - 2022-05-22T16:54:02+05:30 IST

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు ఉరకలేస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంపై భాగంలో ఉండే

Tungabhadraలోకి ఉరకలేస్తున్న వరద నీరు

                - ఒక్కరోజులోనే 8 టీఎంసీల చేరిక

                - ఖరీఫ్‌కు ముందస్తుగా నీరు వదిలే అవకాశం


బళ్లారి(బెంగళూరు): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు ఉరకలేస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంపై భాగంలో ఉండే  తుంగ, భద్ర, సుంకేసుల రిజర్వేయర్లు నిండిపోయాయి. శనివారం సాయంత్రం అధికారుల లెక్కల ప్రకారం 96 వేల 956 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం నాటికి ఇన్‌ఫ్లో 1,53,032 క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఆదివారం సాయంత్రానికి సుమారు 40 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది. డ్యాం నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 23.545 టీఎంసీలకు చేరింది. జలాశయం పైభాగంలో ఉండే పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు ప డడంతో ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో చేరుతోందని బోర్డు వర్గాలు ఆ నందం వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఆయకట్టుకు జూన్‌ లోనే ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-22T16:54:02+05:30 IST