Tungabhadraకు జలకళ

ABN , First Publish Date - 2022-07-07T17:17:32+05:30 IST

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. గత మూడు రోజుల నుంచి

Tungabhadraకు జలకళ

- 34,074 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

- కాలువలకు ముందుగానే నీరు విడుదల..?


బళ్లారి(బెంగళూరు), జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. గత మూడు రోజుల నుంచి కర్ణాటకలోని మలనాడు ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పైన ఉన్న తుంగ, భద్ర నదుల నుంచి తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. బుధవారం టీబీ బోర్డు అధికారులు ఉదయం వేసిన నీటి లెక్కల ప్రకారం డ్యాంలో 52.989 టీఎంసీల నీరు చేరాయి. ఇన్‌ఫ్లో కూడా 34,074 క్యూసెక్కులు వస్తోంది. ఇది గంటగంటకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తుండం వల్ల తుంగభద్రకు నీరు ఉధృతంగా చేరుతున్నాయి. తుంగభద్ర జలాశయం కింద ఖరీఫ్‌ సాగు నీటి విడుదలకు ఇప్పటికే ఐసీసీ సమావేశంలో తేదీలు ఖరారు చేశారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల్లో జరుగుతున్న అధునికీకరణ పనులు వేగవంతం చేయాలని బోర్డు అఽధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఐసీసీ సమావేశంలో నిర్ణయించిన తేదీల కన్నా ముందుగానే కాలువలకు నీరు విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తుంగభద్ర నుంచి నీటి కోటా ప్రకారం రెండు రాష్ట్రాలు ఇంకా ఇండెంట్‌ కోరలేదు. దీని బట్టి నీరు ఎప్పడు వదిలేది అధికారులు నిర్ణయం తీసుకుంటారు. తుంగభద్రలో నీరు పెరుగుతుండడంతో పరిసర రైతులు జలాశయాన్ని చూస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T17:17:32+05:30 IST