tungabhadraకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-17T17:31:30+05:30 IST

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జలధార అయిన తుంగభద్రకు వరద నీరు కొనసాగుతోంది. గత 10 రోజులుగా వరద తగ్గకుండా వస్తూనే ఉంది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీరు నదికి వదిలినట్లు

tungabhadraకు కొనసాగుతున్న వరద

                   - 10 గేట్లు ఎత్తి నదికి నీరు విడుదల


బళ్లారి(karnataka): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జలధార అయిన తుంగభద్రకు వరద నీరు  కొనసాగుతోంది. గత 10 రోజులుగా వరద తగ్గకుండా వస్తూనే ఉంది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీరు నదికి వదిలినట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం సామర్థం 1633 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 100.85 అగుడుల నీరు నిల్వ ఉంది. జలాశయంకు ఇన్‌ఫ్లొ ద్వారా 47.022 క్యూసెక్కుల నీరు వస్తున్నాయి. వీటిలో వివిద కాల్వలు, నదికి మొత్తం కలిపి 46.642 కూసెక్కుల నీరు బయటకు వదులు తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పుష్కలంగా డ్యాంకు నీరు వచ్చి చేరాయి. దీనితో రబీలోనూ పంటల సాగుకు ఎటువంటి నీటి కొరత ఉండడదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-10-17T17:31:30+05:30 IST