Tungabhadra Reservoir: తొణికిసలాడుతున్న తుంగభద్ర

ABN , First Publish Date - 2022-08-10T16:51:56+05:30 IST

తుంగభద్ర(Tungabhadra) నిండుకుండలా తొణకిసలాడుతుంది. జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా చేరుతుంది. జలాశయ పరివాహక

Tungabhadra Reservoir: తొణికిసలాడుతున్న తుంగభద్ర

                     - 33 గేట్లు ఎత్తి లక్షా 40 వేల క్యూసెక్కులు నదికి విడుదల


బళ్లారి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర(Tungabhadra) నిండుకుండలా తొణకిసలాడుతుంది. జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా చేరుతుంది. జలాశయ పరివాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains)కు వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. జలాశయంలోకి దాదాపు లక్షా  40వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు జలాశయానికి ఉన్న 33 గేట్లు తెరచి లక్షా 40 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. 25 గేట్లు మూడన్నర అడుగులు, 8 గేట్లను ఒకటిన్నర అడుగు ఎత్తి నీటిని నదికి మళ్లించారు. జలాశయం నీటి నిలువ సామర్థ్యం 105.788 టింసీలు కాగా ప్రస్తుతం 102.014 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నది పక్కన ఉన్న గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నదిపై నిర్మించిన వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికుల రాకపోకలు సాగించరాదని ఆంక్షలు విధించారు.

Updated Date - 2022-08-10T16:51:56+05:30 IST