Tungabhadra river: ఉప్పొంగిన తుంగభద్ర

ABN , First Publish Date - 2022-07-30T18:18:40+05:30 IST

తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ ప్ర

Tungabhadra river: ఉప్పొంగిన తుంగభద్ర

కంప్లి(బెంగళూరు), జూలై 29: తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ ప్రమాణంలో నీరు వస్తుండటంతో హంపిలోని కోదండరామస్వామి ఆలయం, రుషిముఖ పర్వతం(Rushimukha mountain) తాకుతూ వేగంగా పరుగులు తీస్తున్నాయి. కంప్లి కోటె వద్ద కూడా వంతెనకు తాకుతూ నీరు ప్రవహిస్తోంది. వంతెనపై రక్షణగా వుండే దిమ్మెలు పూర్తిగా ధ్వంసం కావడంతో పీడబ్ల్యూ అధికారులు రక్షణ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఆరు రోజులకు పైగా వంతెనపై నీరు ఉప్పొంగి ప్రవహించింది. మరోసారి కూడా వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తుండటంతో ఈసారి కూడా కష్టాలు తప్పవేమో అంటూ ప్రజలు ఆందోళన(worry) చెందుతున్నారు. వెంటనే వంతెన ఎత్తు పెంచి కంప్లి, గంగావతి రాకపోకలకు అంతరాయం కలుగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. 



Updated Date - 2022-07-30T18:18:40+05:30 IST