సద్గుణ సుభద్ర.. తుంగభద్ర

ABN , First Publish Date - 2020-11-29T05:15:23+05:30 IST

ని వర్‌ తుపాన్‌ ప్రభావం ఉన్నా, తుంగభద్ర పుష్కరాలకు భ క్తులు తరలి వస్తూనే ఉన్నారు.

సద్గుణ సుభద్ర.. తుంగభద్ర
పుల్లూరు ఘాట్‌ వద్ద భక్తులు

- 9వ రోజుకు చేరిన పుష్కరాలు  

- శనివారం 19,788 మంది హాజరు

- ఇప్పటి వరకు పుష్కర స్నానాలు చేసిన 1,00,195 మంది  

- రేపు కార్తీక పౌర్ణమి 8 పెరగనున్న రద్దీ


తుంగభద్ర పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి.. ఉత్సవాలు తొమ్మిది రోజులకు చేరుకోగా, భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు.. నివర్‌ తుపాన్‌ కారణంగా తేలికపాటి జల్లులు కురువడంతో పాటు చలిగాలులు వీస్తున్నా భక్తులు ఘాట్ల వద్దకు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు.. శుక్రవారం రద్దీ కొంత తగ్గినా, శనివారం మాత్రం దాదాపు 20 వేల మంది హాజరయ్యారు.. ఈ తొమ్మిది రోజుల్లో లక్ష పైచికులు భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో పాటు దాదాపు తొమ్మిది వేల మంది తమ పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేశారు.. పుష్కరాల ముగింపునకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటం, ఆదివారం సెలవు, సోమవారం కార్తీక పౌర్ణమి ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది..


(గద్వాల- ఆంధ్రజ్యోతి)/ అలంపూర్‌, నవంబరు 28 : ని వర్‌ తుపాన్‌ ప్రభావం ఉన్నా, తుంగభద్ర పుష్కరాలకు భ క్తులు తరలి వస్తూనే ఉన్నారు. శుక్రవారం ముసురు పడు తూనే ఉండటంతో కొద్ది మందే హాజరు కాగా, శనివారం వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం వర్షం పడుతుం డటంతో కొంత మందగించినా, ఆ తరువాత క్రమంగా భ క్తులు ఘాట్ల వద్దకు చేరుకొని పుష్కర స్నానాలు ఆచరిం చారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నెల్లూరు, వై జాగ్‌, రాజమండ్రి, తాడిపత్రి జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కాగా, తుపాన్‌ కారణంగా రెండు రోజులుగా ఈ దురు గాలులు, వర్షాలకు ఘాట్ల వద్ద తాత్కాలికంగా ఏర్పా టు చేసిన షామియానాలు కూలిపోయాయి. వాహనాల పార్కింగ్‌ స్థలాలు బురదమయంగా మారాయి. దీంతో పారిశుధ్య సిబ్బంది, ఘాట్ల నిర్వాహకులు ఎప్పకటిప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు.


వీఐపీల సందడి


అలంపూర్‌ పుష్కర ఘాట్‌ వద్ద ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ దంపతులు పుష్కర స్నానాలు ఆ చరించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆల యాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చండీయాగం ని ర్వహణకు రూ.25 వేలు, అన్నదానానికి రూ.25 వేలను వితరణ చేశారు. ఆయనతో పాటు విజయవాడకు చెందిన న్యాయమూర్తి హరినారాయణ, ఏపీ సాంఘిక సంక్షేమ శా ఖ డైరెక్టర్‌ రమాదేవి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు శశిధర్‌, ఎస్‌బీఐ ఏజీఎం రాజేశ్‌ పుష్కర స్నానాలు చేశారు.


మిగిలింది మూడు రోజులే..


తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమై తొమ్మిది రో జులు కాగా, ఇంకా మూడు రోజులు మాత్రమే ఉత్సవాలు జరగనున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు సోమవారం కార్తీక పౌర్ణమి ఉండటంతో వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇ ప్పటి వరకు పుష్కరాలకు 1,78,023 మంది హాజరయ్యారు. ఇం దులో అలంపూర్‌లో 1,00,195, పుల్లూరులో 24,049, రాజోలి లో 43,261, వేణిసోంపురంలో 10,518 మంది పుష్కర స్నానాలను ఆచరించారు. శనివారం నాలుగు ఘాట్ల వద్ద 19,788 మంది పుష్కర స్నానాలు చేయగా, ఇందులో అలంపూర్‌లో 10,971 మంది, పుల్లూరులో నాలుగు వేలు, రాజోళిలో ఐదు వే లు, వేణిసోంపురంలో 500 మంది హాజరయ్యారు.


9 వేల పిండ ప్రదానాలు


పుష్కరాల సందర్భంగా ఆయా ఘాట్ల వ ద్ద భక్తులు తమ పితృ దేవతలకు పిండ ప్రదా నాలు చేస్తున్నారు. తొమ్మిది రోజుల్లో నాలుగు ఘా ట్ల వద్ద దాదాపు తొమ్మిది వేల మంది భక్తులు పిండ ప్రదానాలు చేశారు. ఒక్క అలంపూర్‌ ఘాట్‌ వద్దే భక్తులతో పిండ ప్రదానాలు చేయించేందుకు 145 మంది బ్రాహ్మణులను నియమించారు. మిగిలిన ఘాట్ల వద్ద పది నుంచి 20 మందిని నియమించారు. 


తగ్గిన నీరు


పుష్కరాల ప్రారంభంలోని అలంపూర్‌, రాజోలి, పుల్లూరు, వేణిసోంపురం ఘాట్ల వద్ద నదిలో నీరు ఉం డేది. అయితే, రెండు రోజుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో జ ల విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తుండటంతో అలంపూర్‌ ఘాట్‌ వద్ద నీరు తగ్గిపోయింది. భక్తులు మునగడానికి కూడా వీలు లేనంతగా నీరు లేదు. దీంతో సీసాలలో నది నీటిని నింపుకొని స్నానాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం నదిలో నీరు ఉండే విధంగా చూడాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-11-29T05:15:23+05:30 IST