జగన్‌ది వేటగాడి మనస్తత్వమే..: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-04T19:18:41+05:30 IST

సీఎం జగన్ మీద, ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ది వేటగాడి మనస్తత్వమే..: తులసిరెడ్డి

విశాఖపట్నం: సీఎం జగన్ మీద, ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ.. రౌడీల పార్టీ జగన్‌ది వేటగాడి మనస్తత్వమే.. పావురాలకి ఆహారాన్ని వేస్తారని.. అది పావురాల మీద ప్రేమ కాదు, పావురాల మాంసం మీద.. ఇది జగన్ తీరు అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన వస్తుందని  అప్పుడే చెప్పాను.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీకి తోక పార్టీలు.. అని చెప్పారు. ఆంధ్రలో కుస్తీ...హస్తినలో దోస్తీ బీజేపీ చంకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. టీడీపీ దద్దమ్మ పార్టీ.. జనం లేని పార్టీ జనసేన... ఈ మూడు పార్టీలు బీజేపీకి బినామీలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ.. అందరి పార్టీ’ అని తులసిరెడ్డి  పేర్కొన్నారు.

Updated Date - 2021-03-04T19:18:41+05:30 IST