నత్త నడకన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం: తులసీ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-18T18:13:45+05:30 IST

వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నత్త నడక సాగుతోందని తులసీ రెడ్డి విమర్శించారు.

నత్త నడకన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం: తులసీ రెడ్డి

అమరావతి: వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నత్త నడక సాగుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. వైకాపా పాలనలో 28.30 లక్షల ఇళ్లు మంజూరు అయినప్పటికీ మూడేళ్లలో, మూడు ఇళ్లు  కూడా పూర్తి కాలేదని విమర్శించారు. యూనిట్ కాస్ట్ సరిపోక పోవడం, సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం, ఇసుక కొరత, మౌలిక సదుపాయాల కొరత ఇందుకు కారణాలని ఆరోపించారు. యూనిట్ కాస్ట్‌ను రూ. 1.80 నుంచి రూ.2.80కు పెంచాలని, ఇసుక కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని తులసీ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-18T18:13:45+05:30 IST