వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ఏమైంది?: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T17:59:03+05:30 IST

వైయస్సార్ పెళ్లి కానుక పధకం ఏమైందంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ఏమైంది?: తులసిరెడ్డి

అమరావతి: వైయస్సార్ పెళ్లి కానుక పధకం ఏమైందంటూ ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్క, చెల్లెమ్మలకు ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదన్నారు. కొందరికి బిడ్డలు కూడా పుట్టారు.. కళ్యాణ మిత్ర బకాయిల మాటేమిటని నిలదీశారు. వైసీపీ మ్యానిఫెస్టో మీకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కాదా? అని అన్నారు. ‘మాట తప్పమని.. మహిళలను నమ్మించి మోసగించమని పవిత్ర గ్రంధాలు చెప్పలేదే.. వెంటనే పెళ్లికానుక, కళ్యాణ మిత్ర బకాయిలు విడుదల చేయండి.. లేకుంటే చెల్లెమ్మల శాపనార్ధాలకు వైసీపీ ప్రభుత్వం బలి కాక తప్పదని’ తులసిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-07-25T17:59:03+05:30 IST