Jagan పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది: Tulasi Reddy

ABN , First Publish Date - 2022-06-14T21:03:18+05:30 IST

జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని తులసి రెడ్డి విమర్శించారు.

Jagan పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది: Tulasi Reddy

Amaravathi: జగన్ (Jagan) మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా, గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Tulasi Reddy) ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా.. పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమేనని విమర్శించారు. మద్యం ద్వారా రాబోవు 12 ఏళ్లకు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 9.62 శాతం వడ్డీతో రూ.8,300 కోట్లు అప్పు తీసుకుందన్నారు. దీంతో సమీప భవిషత్తులో కూడా మద్యపాన నిషేదం ఉండదని తేలిపోయిందన్నారు. ఇది మాట తప్పడం, మహిళలను నమ్మించి మోసగించడమేనన్నారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. ఆరోగ్య శ్రీ డబ్బులు రోగుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం మరిన్నీ చిక్కులు తెస్తుందన్నారు. రోగులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తప్ప ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవని, దీని వల్ల సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతారన్నారు. పేద రోగుల పట్ల సీఎం జగన్ యమధర్మరాజుగా మారడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు.

Updated Date - 2022-06-14T21:03:18+05:30 IST